ఆ పదం వాడతావా? నాతో మాట్లాడకు!
on Sep 29, 2021
బుల్లితెరపై తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ మహిళా వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రవి, 'బిగ్ బాస్' ఇంటి లోకి వెళ్ళిన తర్వాత మహిళలకు శత్రువు అవుతున్నాడు. ఇంటిలో మహిళా సభ్యులు ఒక్కొక్కరుగా రవి ప్రవర్తనతో ఆగ్రహం చెందుతున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గత వారం రవి కారణంగా ప్రియా వెక్కివెక్కి ఏడ్చారు. ఈ వారం రవి మాటకు కాజల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
నాలుగో వారంలో ఆర్జే కాజల్ ను రవి నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు అతను ఉపయోగించిన పదంపై కాజల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మంగళవారం కాజల్, మానస్ గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో... వాళ్ళిద్దరి దగ్గరకి రవి వచ్చాడు. వెంటనే కోపంతో అక్కడినుండి కాజల్ లేచి వెళ్ళిపోయింది. రవితో పాటు మానస్ కూడా ఆమెను కూర్చోమని అడిగారు. అప్పుడు రవిని కాజల్ ప్రశ్నించింది. 'ఫిజికల్ ఏంటి?' అని! 'కొట్టడం ఫిజికల్ కాదా?' అని రవి అడిగాడు. 'ఆ పదం వాడతావా? నాతో మాట్లాడకు' అని వెళ్ళిపోయింది. సిరి హనుమంతును పట్టుకుని ఏడ్చింది.
Also Read